Friday, May 13, 2011

క్రమ"శిక్ష"ణ

అసలు  క్రమశిక్షణ అనగానే మనకి ఎందుకు భయం??? దానికి విలువ ఇవ్వాలి కానీ దానికి మనం ఎందుకు భయపడటం.. క్రమశిక్షణ అనగానే తొంభై శాతం మందికి భయమే వేస్తుంది, దానికి కారణం క్రమశిక్షణ వల్ల కాక, ఆ పద్దతి లో ఉన్న "శిక్ష" వల్ల అని నా అభిప్రాయం.

అసలు క్రమశిక్షణ అనగానే మనకి ముందర గుర్తుకువచ్చేది "military discipline" అన్న పదం. అందులో మనకి కనిపించేది ఆ క్రమశిక్షణ లో ఉన్న కష్టమే తప్పితే, దాని వల్ల వాళ్ళకి వచ్చే లాభం మనం గమనించటం లేదు. నిజం గా గమనించిన వాళ్ళు military discipline  అంటే భయపడరు అని నా ఉద్దేశం. అంత కష్టం ఎందుకు పడాలి అని అనుకుంటే,ఆ మాత్రం కష్టం కూడా లేకుండా ప్రపంచం లో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం ఆలోచించటం అవసర మేమో.
ఆ కష్టం ఒక సారి పడితే చాలు.. దాని వల్ల జీవితం లో చాలా కలిసి వస్తాయి. అది గమనించిన వాడు కష్టం అనుకోక ఇష్టం అనుకుంటాడు. చిన్న తనం లో కష్టం, ఇష్టం, నష్టాలని తూకం వెయ్యలేము కాబట్టి పెద్దలే మనకోసం నిర్యయిస్తారు. కానీ తెలిసీ తెలియని వయసులో అది మనకి కష్టం అని అనుకొని, వారి నిర్ణయాన్ని గౌరవించము. అలా చేయటం వల్ల మనకే నష్టం తప్ప పెద్ద వాళ్ళకి ఏమీ నష్టం లేదు. వాళ్ళు అప్పటికే జీవితం చూసి ఉంటారు మరియు అవసరం అయినవి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు నష్టపోయింది మనం నష్టపోకూడదు అని మంచి ఆలోచిస్తారు తప్ప మనకి  కష్టం మిగిల్చాలి అని కాదు  అన్న సంగతి కూడా మనం అర్థం చేస్కోలేని స్తితి లో మనం ఉన్నాం, ఉంటున్నాం. అలాంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలకి చెప్పాలి అంటే, ఎంత చెప్తారో  మనం ఊహించగలం. పోనీ వాళ్ళ  సొంత అనుభవాల మీద నేర్చుకొని చెప్పినా, మళ్ళి అదే జీవిత చక్రం మొదటకి వచ్చినట్టే కదా.. వాళ్ళు కూడా వినరు కదా.

క్రమశిక్షణ ఉండటం వల్ల లాభాలు ఆలోచిస్తే చాలా ఉంటాయి మనకి. చిన్నప్పుడు సరిగ్గా చదువు కుంటాము, పెద్దలకి గురవం ఇవ్వటం, దాని వల్ల మనకి గురవం పెరుగుతుంది, మంచి చెడుకి తేడ తెలుస్కు నే ఆలోచన ఉంటుంది, పెళ్లి అయ్యాక సంసారం సరిగ్గా చక్కబెట్టుకోవటం ఇంకా పిల్లలకి మంచి నేర్పించే స్థితి లో మనము ఉంటాము. జీవితం లో మొదట ముఖ్యమైనది చదువు అని నేను అనను. ఇక్కడ , ఈ సందర్భం లో చదువు అంటే, ఏదైనా జీవనోపదిని ఇచ్చేది అని నా ఉద్దేశం.అది విద్య కావచ్చు, ఆటలు కావచ్చు, వ్రుత్తి విద్య కావచ్చు, ఇంకా వీరే ఎ వ్యాపారం అయిన కావచ్చు. కానీ ఏదో ఒకటి అయితే అవసరం కదా. అది లేక పోయిన, కనీసం సంసారం చక్క బెట్టుకొనే స్థితి లో ఉన్నా, మనని చేస్కున్న వాళ్ళు ఆదరిస్తారు. అటు చదువు లేక, సంసారం చక్క బెట్టుకొనే స్థితి లేక పొతే ఇంకా జీవితమే లేదు అన్న సంగతి మనం గమనించాలి.

పెద్దలు కూడా క్రమశిక్షణ లో పెడుతున్నాము  అని అనుకొని, పిల్లలని భయపెట్టటం,శిక్ష  వెయ్యటం సబబు కాదు, దాని వల్ల వాళ్ళకి చాలా నష్టం చేకూర్చిన వల్లే అవుతారు. ఎ నిమిషాన ఆ భయం పోతుందో, ఆ నిమిషం లోనే వాళ్ళ సొంత స్వభావం బయటకి వస్తుంది మరియు దాని వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి, జరుగుతున్నాయి. ఎల్ల కాలం పెద్దలే వాళ్ళని control లో పెట్టలేరు కదా. ఎవరికి వారికీ  మంచి చెడు ఆలోచించే స్థోమత రావాలి కదా.. అది పెంపొందించే శక్తీ ఇచ్చినప్పుడు పెద్దల భాద్యత పూర్తిగా నిర్వర్తిన్చినట్టు అని నా అభిప్రాయం.

ఈ తరం లో ఎంత మంది క్రమశిక్షణ ని పాటిస్తున్నారు అని ఒక సారి ఆలోచిద్దాం.ఎవరికీ వారు పాటిస్తున్నారు అని అనుకుంటే సరిపోదు కదా.. అది కనుక పాటిస్తే ఎదుటి వారు  గమనిన్చేటట్టు గానే  ఉంటుంది దాని పర్యవసానం. దానిని ఎవరూ దాచలేరు. మొత్తానికి నా అభిప్రాయం లో అటు పిల్లలు , ఇటు పెద్దలు ఇద్దరు ఎవరి భాద్యత వాళ్ళు నిర్వర్తిస్తే గానే, ఒకరి జీవితం, ఒకరి సంసారం, ఒక కుటుంబం చక్క బడుతాయి. అలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే, ప్రతి కుటుంబం సవ్యం గా ఉంటుంది , దాని తో పాటు మన పురోగతికి ఇంకా దీశాభివృద్ధికి తోర్పడుతాము  పుణ్యం పురుషార్ధం రెండు జరుగుతాయి.

క్రమశిక్షణ అంటే క్రమం లో ఉండటానికి శిక్షణ నే కానీ క్రమం లో పెట్టటానికి వేసే  శిక్ష కాదు అని మనం గమనించాలి.

No comments:

Post a Comment