Saturday, December 10, 2011

సద్దుకోవటం నేర్చుకుందాం


మన తల్లి తండ్రులను ఎంచుకునే అవకాశం మనకి ఉందా? లేదు కదా. వారు ఎలా ఉన్నా, ఏమి చేసినా మహా అయితే వారి మీద కోపం వస్తుందేమో కాని, వారిని విడిచి వెళ్ళే ఉద్దేశం మనకి రాదు , రాకూడదు. అలా విడిచి వెళ్ళే వాళ్ళ గురించి మనం ఇక్కడ ప్రస్తావిన్చుకోవటం లేదు అనుకోండి. వాళ్ళ గురించి మాట్లాడుకునే అంత గొప్ప వాళ్ళు కాదు వాళ్ళు , నా ఉద్దేశం లో. గొప్ప వాళ్ళు కానఖర్లేదు, కనీసం మామూలు సంస్కారం ఉన్నా వాళ్ళు కుడా కాదు అన్నది నా ఉద్దేశం.

మన  తల్లి తండ్రులను ఎంచుకునే అవకాశం లేనప్పుడు, వాళ్ళు ఎలా ఉన్నా మనం వాళ్ళని మనవాళ్ళు అనుకొని కలిసి ఉన్నప్పుడు, మనతో సహజీవనం చేసే వారి గురించి ఆలోచించటం, ఫలానా లాంటి వాళ్ళు కావలి అని వెతకటం ఎంత వరకు సబబు అని ఆలోచిస్తూ రాస్తున్న వ్యాసం ఇది.

మనకోసం మన తల్లి తండ్రులు వెతికి, నిర్ణయించిన వారు పూర్తిగా వంద శాతం (౧౦౦ %) సరి అయిన వారు అని ఖచ్చితంగా మనకి తెలియదు, వారికి తెలియదు. తల్లి తండ్రులు ఎప్పటికి మంచే చేద్దాం అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు కూడా. ఏ తల్లి తండ్రి పిల్లలకి నష్టం కలిగించాలని ఆలోచించరు, కావాలని హాని చెయ్యరు. ఏదో పొరపాటున సరి అయిన నిర్ణయం తెసుకోవటం లో తప్పటిఅడుగు వేసి ఉండచ్చు. మనుషులు అన్నాక పొరపాట్లు చెయ్యకుండానే ఉంటారా ఎవరైనా. ఒకరు చిన్నది అయితే, ఒకరు పెద్దది, తేడా అంటే, అది కూడా వచ్చిన ఫలితాన్ని బట్టి చిన్న తప్పా , పెద్ద తప్పా అన్నది తేలేది. తల్లి తండ్రులకి ఎంత బాధ్యత ఉందో, మనకి ఎదుటి మనిషిని అర్థం చేస్కుకోవటం లో అంతే బాధ్యత ఉండాలి, అది పెళ్ళికి ముందర కావచ్చు, తరవాత కావచ్చు. పెళ్ళికి ముందర ఎదుటి మనిషిని అర్థం చేస్కోవటం లో లోపం ఉంటే, పెళ్లి తరవాత అదే మనిషితో కుదిరినంత వరుకు అలవాటు పడి, సద్దుకు పోవటం అయినా నేర్చుకోవాలి. తల్లి తండ్రులు ఎలా ఉన్నా వాళ్ళని మన వాళ్ళు అనుకొని సద్దుకోగలిగిన వాళ్ళం, పెళ్లి అయ్యాక ఆ మనిషితో ఎందుకు సద్దుకు పోలేకపోతున్నాము?

నిజానికి ఎవరికీ నూరు శాతం మనసులు, ఇష్టాలు, భావాలు కలిసే మనిషి ఎక్కడ దొరకరు. ప్రపంచం లో ఏ ఇద్దరు మనుషులు పూర్తిగా compatible గా ఉండరు. ఎంత కాలం వేచి చూసినా, ప్రపంచం మొత్తం వెతికిన అలా compatible persons దొరకరు. ఏదో ఒక విషయం లో, ఎప్పుడో ఒకప్పుడు ఎదుటి మనిషితో సద్దుకోవాల్సిన అవసరం, పరిస్థితి వస్తుంది. అలా సద్దుకోవాల్సిన పరిస్థితే వస్తే, ఎవరితోనో ఎందుకు, తల్లి తండ్రులు మనకోసం వెతికి, మన కోసం "తిను" అని నిర్ణయించిన మనిషితోనే ఎందుకు సద్దుకోకూడదు? మనల్ని కని పెంచిన తల్లి తండ్రులకన్నా మనగురించి ఇంకా ఎవరికీ బాగా తెలుస్తుంది. నిజానికి మనగురించి మనకన్నా మనల్ని కన్న వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా?. వాళ్ళకి మన ప్రవర్తన, ఏ పరిస్థుతుల్లో ఎలా ప్రవర్తిస్తాము అన్నది కూడా బాగా తెలుస్తుంది. దాని ప్రకారమే మనము ఎలాంటి వాళ్ళతో సరిగ్గా ఉండగలమో అన్నది వాళ్ళకే బాగా తెలుస్తుంది మన కన్నా. అదీ కాకుండా పెద్ద వాళ్ళు అయినందుకు, వాళ్ళకి ఉన్న అనుభవానికి, మనకోసం చూసిన మనిషి మనకి ఎంత వరుకు సరిపడతారు అన్నది వాళ్ళకి బాగా తెలుస్తుంది, సరిఅయిన వాళ్ళని చూస్తారు కుడా. మరి వాళ్ళ నిర్ణయాన్ని మనం ఎందుకు గౌరవించటం లేదు, గౌరవిస్తూ మనకోసం చూసిన మనిషి తో  ఎందుకు
 సద్దుకోలేక పోతున్నాము? సద్దుకోకుండా హద్దులు దాటి విడాకుల దాకా ఎందుకు వెళ్తున్నాము , లేదా మన భాగస్వామిని మనమే ఎందుకు వెతుకుంటున్నాము?

ఫలనా మనిషి మన జీవిత భాగస్వామి అని మనమే ఎంచుకోటానికి కారణాలు ఏమిటి? నమ్మినా నమ్మక పోయిన, ప్రతి మనిషి ఇంట్లో ఉన్నట్టు బయట ఉండరు. అది అక్షరాల నిజం. మనమే మన జీవిత భాగస్వామిని వెతుకున్నప్పుడు మనకి ఆ మనిషి బయట ప్రవర్తిన్చినప్పుడు ఎలా ఉన్నారో అదే తెలుస్తుంది కదా. అంటే అదే మనిషి , అదే పరిస్థితి లో ఇంట్లో ఉంటే ఎలా ప్రవర్తిస్తారు అన్నది మనకి తెలియదు అన్నమాటే కదా. ఈ మాట మనకి ఎందుకు గుర్తు ఉండదు? ఇలాంటివి గుర్తుపెట్టుకోకుండా మనమే ఎందుకు వెతుకుంటున్నాము?

ఒక మనిషిని  మనం పూర్తిగా అర్థం చేస్కోవాలి అంటే, ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహిత్యం పెరగాలి, పెరగాలి అంటే ఎక్కువ కాలం పడుతుంది. అలా ఎక్కువ కాలం స్నేహం, సాన్నిహిత్యం గా ఉంటే ఆ మనిషి నిజస్వరూపం ఎంతో కాలం దచలేరు, బయట పడి పోతారు. అలా కాలం గడిచిన కొద్ది ఎదుటి మనిషి లోపాలు కూడా తెలుస్తాయి.అలా కాలం గడిచిన కొద్ది లోపాలు తెలియటం తో పాటు, వాళ్ళ లోపాలని మనం పెద్ద లోపాలుగా భావించము, పైగా వాటిని పెద్దగా పట్టించుకోవటం కూడా తగ్గిస్తాము. అదే కాకుండా మనము మారతాము, ఎదుటి మనిషి మారుతారు. ఇరువురి లోను మార్పులు వస్తాయి, ఇద్దరు ఒకరితో ఒకరు సద్దుకోవటం మొదలు పెడతారు.

ఇలాంటి సద్దుబాట్లు , తల్లి తండ్రులు చేసిన పెళ్లి ల్లల్లో ఎందుకు ఎక్కువ అవ్వడం లేదు??

పూర్వ్యము , పెళ్ళిళ్ళు చిన్న పిల్లల్లుగా ఉన్నప్పుడే చేసేసేవారు. మరి అంత చిన్న వయసులో చేసినందుకు, ఎదుటి వాళ్ళతో సద్దుకునే లక్షణం ఎక్కువ ఉంటుంది. పిల్లలకి నేర్చుకునే లక్షణం చిన్నప్పుడే ఎక్కువ ఉంటుంది కదా. అలాగే ఎదుటి మనిషి ప్రవర్తన తో పాటు సద్దుకుపోవటం కూడా చిన్న తనం లో చాలా సులువుగా వస్తుంది. అప్పటి పెళ్ళిళ్ళు చిరకాలం నిలవటానికి ఇది ఒక కారణం అవ్వచ్చు. 

ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్న ఈ కాలం లో, చిన్నప్పటి ఒక లక్షణం పెద్ద అయ్యాక కూడా కొనసాగించగలుగుతే  ఎన్నో పెళ్ళిళ్ళు పెటాకులవరుకు రాకుండా చేస్కోవచ్చేమో మనము. ఒకసారి అలోచించి చూద్దాం, అలోచించి చేస్తే మరీ బాగుంటుంది.

ఇంట్లో ఒక ఖరీదు అయిన వస్తువు కొనేటప్పుడు మంచిది కొనక పోతే అయ్యో వృధా అవుతుంది అని అలోచించి, మంచిది కొనటానికి ప్రయత్నిస్తాము. సరి అయిన వస్తువు రాక పోయినా అంత డబ్బులు పెట్టాం కదా అని సద్దుకుంటాం, అలాంటిది జీవితాంతం కలిసి ఉండాల్సిన ఒక మనిషితో మాత్రం సద్దుకోలేక పోతున్నాం. అలా కాకుండా ఇంట్లో ఏదో ఒక సామాను కొని నచ్చక పొతే తిరిగి ఇచ్చేసినట్టు, మనం మన జీవిత భాగస్వామిని ఎందుకు మార్చుకుంటున్నాము? ఇంట్లో సామాను తో సమానంగా మన జీవిత భాగస్వామిని ఎందుకు treat చేస్తున్నాము? అలా treat చేసి పెళ్ళిళ్ళు విడాకులవరుకు ఎందుకు తెచ్చుకుంటూన్నాము? ఎందుకు సద్దుకోలేక పోతున్నాము? సద్దుకోవటం ఎందుకు నేర్చుకోలేక పోతున్నాము? ఒక్క సారి అలోచించి చూద్దాం!!!

Saturday, May 28, 2011

జీవిత చక్రం

ప్రతిఒక్కరి జీవితం లో అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్ని మనకి కావాల్సిన దానికి అన్న కొంచం ఎక్కువ ఉంటే, అందులో సౌకర్యం వెతుకుంటాము. అదే అవసరాన్ని అవసరం లాగా కాకుండా, సౌకర్యం లాగా కూడా కాకుండా వృధా చేసే స్థితి కి చేరితే ఆది Luxury అవుతుంది  అని నా ఉద్దేశం.


ప్రతి మనిషిని, తిండి, బట్ట, ఇల్లు అనే మూడు కనీస అవసరాలు ఉంటాయి.   ఈ మూడు ఉంటేనే బతక గలం. తిండి అనేది అందరికి అవసరమే.  తిండికి కూడా గతి లేని వాళ్ళకి బాగా ఆకలి వేసి, కొన్ని రోజులు పస్తు ఉంటే - తిండి అవసరం అవుతుంది - తినటానికి ఏదో ఒకటి దొరికనా చాలు స్థితి లో ఉంటాడు. అదే తిండి కొంత మందికి సౌకర్యం కూడా అవుతుంది-అదే రోజు ముప్పుట్ల తింటూ, కడుపు నిండిన వాళ్ళకి ఆకలి అంటేనే తెలియదు, అలాంటి వాళ్ళకి  తిండి అవసరం తో పాటు, అదే తిండిలో వాళ్ళకి ఇస్టం అయినది చూస్కోనేసౌకర్యం కూడా వెతుకుంటారు.
అంత కన్నా ఎక్కువ స్థితి లో ఉన్న వాళ్ళకి, తిన్నంత తిని, మిగిలినది పారేసే వాళ్ళకి ఆది Luxury అవుతుంది. నాకు తెలిసి తిండి ఎవరికి ఆ luxury stage కి రాకూడదు. అలా వస్తే ఒకసారి తిండికి గతి లేని వాళ్ల గురించి గుర్తు తెక్చుకుంటే, ఆలోచిస్తే తెలుస్తుంది ఆ తిండి విలువ ఎంతో?? అండ్ ఎంత మందికి ఆది అవసరమో.

తిండి అనేది సరిఅయిన ఉదాహరణ కాకపోవక్చు, ఇల్లు అనే కనేస అవసరాన్ని ఉదాహారణగా తీసుకుంటే ఎండ, చలి , వర్షం నుంచి కాపాడుకోటానికి, ఒక కప్పు కావాలి. ఆది లేని వాళ్ళకి అది ఒక అవసరం. అదే ఇల్లు ఉన్న వాడికి, ఆ ఇంట్లో ఇన్ని గదులు ఉండాలి అన్నది సౌకర్యం చుస్కోవటం కోసమే. అలాగే అదే ప్రతి గది ఇలా ఉండాలి, ఇవే ఉండాలి అని ఆలోచిస్తే అదే luxury అవుతుంది అని నా ఉద్దేశం. 

అందరి జీవితాలు, రంగుల రాట్నమ్లా ఒక సారి పైకి , మరో సారి కిందకి అవుతూనే ఉంటాయి. కింద ఉన్న వాళ్ళు ఎల్లప్పుడు కిందే ఉండరు, ఆ రట్నమ్లో పైన ఉన్న వాళ్ళు ఎప్పటికీ పైనే ఉండరు. అది తిరుగుతూనే ఉంటుంది. మనం పైకి వక్చకా అది ఆగిపోదు. ఎప్పటికీ పైనే ఉంటాము అని అనుకోవటం కూడా అవివేకం. అలా ఎప్పుడూ పైనే ఉండాలి అని కోరుకుంటూ దానికి తగ్గ కృషి చెయ్యటం మాత్రం మానకూడదు.. అలా పైకి వచ్చినప్పుడు  కింద ఉన్నప్పుడు పడిన కస్టాలు గుర్తుపెట్టుకోవటం అండ్ కిందకి వెళ్ళినప్పుడు పైకి రావాలి అని తపన పెంచుకొని, ఏమి చేస్తే పైకి వస్తామో గుర్తుపెట్టుకోవటం ఎంతో అవసరం.

మనం ఎప్పుడు మన జీవితం లో ఎదుగుతూనే ఉండాలి. ఎదగాలి కానీ , ఎదిగాం కదా అని ఎక్కడ నుంచి మొదలు పెట్టమో మార్చిపోకూడదు అండ్ పైకి ఎదిగిన కొద్ది, ఎదుగుతున్నప్పుడు అనుభవించిన సుఖాలు కస్టాలుఎల్లప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్న ప్రతి మనిషి జీవితం లో గెలుపుని రుచిని చూసినట్టే. అలాంటి గెలుపు చూసిన వాడు పైకి ఎదిగినంత మాత్రాన వాడికి గర్వం రాదు అండ్ రానివ్వడూ. గర్వం రానివ్వక పోగా కింద ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాడు, వాళ్ల ఎదుగుదలకి తోడ్పడుతాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల్లో ఎవరికివారు సౌకర్యం స్థితి నుంచి luxury స్థితి కి రావాలి అని ఆలోచిస్తున్నారు. అందులో తప్పు లేదు, కాని అలా luxury stage లోకి రావటానికి మరియు ఆ స్థితి లోనే ఉండిపోటానికి కింద ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. అది స్వార్ధం అవుతోంది. ఆ స్వార్ధం కోసం తప్పుడు పనులు కూడా చేస్తున్నారు. దాని వల్ల జీవిత చక్రం కిందకి వచ్చినప్పుడు వారికి సహాయం చెయ్యటానికి ఎవరి తోడూ ఉండదు అండ్ ఉండటం లేదు. మనం ఏది చేస్తే మనకి అదే తిరిగి వస్తుంది అనటానికి ఇదే ఒక మంచి నిదర్సనం. ఈ స్వార్ధం తల్లి తండ్రుల దెగ్గర కూడా చూపెడుతున్నారు ఈ కాలం పిల్లలు / జనాలు. వాళ్ళకి పెద్దల అవసరం ఉన్నంత వరుకు వాళ్ళని ఇంట్లో ఉంచుకోవటం, వాళ్ళకి ఓపిక అయిపోయి చెయ్యలేని స్థితి లో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని old age home లో వెయ్యటం. పెద్ద వాళ్ళకి ఆ వయసులోనే కదా తోడూ అవసరం మరియు సహాయం అవసరం. సహాయం కన్నా, ఆ వయసు లో వాళ్ళకి మానసిక తోడూ చాలా అవసరం, అలాంటి స్థితి లో సొంత పిల్లలే పట్టించుకోక పొతే ఇంకా ఎవరు పట్టించుకుంటారు. పట్టించుకున్న వాళ్ళకి కోటి దండాలు అండ్ శతకోటి ధన్యవాదాలు.  ఇవాళ మన పెద్దలు మనకి భారం అయ్యిఅలా దూరం చేస్కుంటే, రేపు మనము కూడా పెద్ద వాళ్ళము అవుతాం అండ్ మనము భారం అవుతాం. పిల్లలు చిన్నతనం  నుంచి 
మనం ఏది చేస్తే అదే నేర్చుకుంటారు కదా. మనం మన పెద్ద వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తున్నామో, అదే మర్యాద మనకి తిరిగి వస్తుంది. స్వార్ధం ఉన్నవాళ్ళు కనీసం, వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ అవసరం గుర్తుపెట్టుకొని అయినా, వాళ్ళ పెద్ద వాళ్ళకి అవసరమైనది చేస్తేనే, పిల్లలు వాళ్ళ అవసరాలు చూస్తారు అని గుర్తుపెట్టుకోవటం ఎంతో అవసరం.


As Per Newton Third law, “For Every Action, there is Equal and Opposite Reaction”.  This is applicable to every thing in life. Think of any small thing in this world, this rule applies perfectly.  May be GOD also follows the same, that’s why we get back in return what ever we do and that is what is what we deserve.

Friday, May 13, 2011

క్రమ"శిక్ష"ణ

అసలు  క్రమశిక్షణ అనగానే మనకి ఎందుకు భయం??? దానికి విలువ ఇవ్వాలి కానీ దానికి మనం ఎందుకు భయపడటం.. క్రమశిక్షణ అనగానే తొంభై శాతం మందికి భయమే వేస్తుంది, దానికి కారణం క్రమశిక్షణ వల్ల కాక, ఆ పద్దతి లో ఉన్న "శిక్ష" వల్ల అని నా అభిప్రాయం.

అసలు క్రమశిక్షణ అనగానే మనకి ముందర గుర్తుకువచ్చేది "military discipline" అన్న పదం. అందులో మనకి కనిపించేది ఆ క్రమశిక్షణ లో ఉన్న కష్టమే తప్పితే, దాని వల్ల వాళ్ళకి వచ్చే లాభం మనం గమనించటం లేదు. నిజం గా గమనించిన వాళ్ళు military discipline  అంటే భయపడరు అని నా ఉద్దేశం. అంత కష్టం ఎందుకు పడాలి అని అనుకుంటే,ఆ మాత్రం కష్టం కూడా లేకుండా ప్రపంచం లో ఎంతమంది ఉన్నారో ఒకసారి మనం ఆలోచించటం అవసర మేమో.
ఆ కష్టం ఒక సారి పడితే చాలు.. దాని వల్ల జీవితం లో చాలా కలిసి వస్తాయి. అది గమనించిన వాడు కష్టం అనుకోక ఇష్టం అనుకుంటాడు. చిన్న తనం లో కష్టం, ఇష్టం, నష్టాలని తూకం వెయ్యలేము కాబట్టి పెద్దలే మనకోసం నిర్యయిస్తారు. కానీ తెలిసీ తెలియని వయసులో అది మనకి కష్టం అని అనుకొని, వారి నిర్ణయాన్ని గౌరవించము. అలా చేయటం వల్ల మనకే నష్టం తప్ప పెద్ద వాళ్ళకి ఏమీ నష్టం లేదు. వాళ్ళు అప్పటికే జీవితం చూసి ఉంటారు మరియు అవసరం అయినవి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు నష్టపోయింది మనం నష్టపోకూడదు అని మంచి ఆలోచిస్తారు తప్ప మనకి  కష్టం మిగిల్చాలి అని కాదు  అన్న సంగతి కూడా మనం అర్థం చేస్కోలేని స్తితి లో మనం ఉన్నాం, ఉంటున్నాం. అలాంటి వాళ్ళు, వాళ్ళ పిల్లలకి చెప్పాలి అంటే, ఎంత చెప్తారో  మనం ఊహించగలం. పోనీ వాళ్ళ  సొంత అనుభవాల మీద నేర్చుకొని చెప్పినా, మళ్ళి అదే జీవిత చక్రం మొదటకి వచ్చినట్టే కదా.. వాళ్ళు కూడా వినరు కదా.

క్రమశిక్షణ ఉండటం వల్ల లాభాలు ఆలోచిస్తే చాలా ఉంటాయి మనకి. చిన్నప్పుడు సరిగ్గా చదువు కుంటాము, పెద్దలకి గురవం ఇవ్వటం, దాని వల్ల మనకి గురవం పెరుగుతుంది, మంచి చెడుకి తేడ తెలుస్కు నే ఆలోచన ఉంటుంది, పెళ్లి అయ్యాక సంసారం సరిగ్గా చక్కబెట్టుకోవటం ఇంకా పిల్లలకి మంచి నేర్పించే స్థితి లో మనము ఉంటాము. జీవితం లో మొదట ముఖ్యమైనది చదువు అని నేను అనను. ఇక్కడ , ఈ సందర్భం లో చదువు అంటే, ఏదైనా జీవనోపదిని ఇచ్చేది అని నా ఉద్దేశం.అది విద్య కావచ్చు, ఆటలు కావచ్చు, వ్రుత్తి విద్య కావచ్చు, ఇంకా వీరే ఎ వ్యాపారం అయిన కావచ్చు. కానీ ఏదో ఒకటి అయితే అవసరం కదా. అది లేక పోయిన, కనీసం సంసారం చక్క బెట్టుకొనే స్థితి లో ఉన్నా, మనని చేస్కున్న వాళ్ళు ఆదరిస్తారు. అటు చదువు లేక, సంసారం చక్క బెట్టుకొనే స్థితి లేక పొతే ఇంకా జీవితమే లేదు అన్న సంగతి మనం గమనించాలి.

పెద్దలు కూడా క్రమశిక్షణ లో పెడుతున్నాము  అని అనుకొని, పిల్లలని భయపెట్టటం,శిక్ష  వెయ్యటం సబబు కాదు, దాని వల్ల వాళ్ళకి చాలా నష్టం చేకూర్చిన వల్లే అవుతారు. ఎ నిమిషాన ఆ భయం పోతుందో, ఆ నిమిషం లోనే వాళ్ళ సొంత స్వభావం బయటకి వస్తుంది మరియు దాని వల్ల చాలా అనర్ధాలు జరుగుతాయి, జరుగుతున్నాయి. ఎల్ల కాలం పెద్దలే వాళ్ళని control లో పెట్టలేరు కదా. ఎవరికి వారికీ  మంచి చెడు ఆలోచించే స్థోమత రావాలి కదా.. అది పెంపొందించే శక్తీ ఇచ్చినప్పుడు పెద్దల భాద్యత పూర్తిగా నిర్వర్తిన్చినట్టు అని నా అభిప్రాయం.

ఈ తరం లో ఎంత మంది క్రమశిక్షణ ని పాటిస్తున్నారు అని ఒక సారి ఆలోచిద్దాం.ఎవరికీ వారు పాటిస్తున్నారు అని అనుకుంటే సరిపోదు కదా.. అది కనుక పాటిస్తే ఎదుటి వారు  గమనిన్చేటట్టు గానే  ఉంటుంది దాని పర్యవసానం. దానిని ఎవరూ దాచలేరు. మొత్తానికి నా అభిప్రాయం లో అటు పిల్లలు , ఇటు పెద్దలు ఇద్దరు ఎవరి భాద్యత వాళ్ళు నిర్వర్తిస్తే గానే, ఒకరి జీవితం, ఒకరి సంసారం, ఒక కుటుంబం చక్క బడుతాయి. అలా ప్రతి ఒక్కరు ఆలోచిస్తే, ప్రతి కుటుంబం సవ్యం గా ఉంటుంది , దాని తో పాటు మన పురోగతికి ఇంకా దీశాభివృద్ధికి తోర్పడుతాము  పుణ్యం పురుషార్ధం రెండు జరుగుతాయి.

క్రమశిక్షణ అంటే క్రమం లో ఉండటానికి శిక్షణ నే కానీ క్రమం లో పెట్టటానికి వేసే  శిక్ష కాదు అని మనం గమనించాలి.

Saturday, January 1, 2011

మొదటి పాట

చాలా recent గా నాగవల్లి సినిమా చూసాను. అందులో వెంకటేష్ introduction పాట చూడగానే, ఈ టపా (post) రాయాలి అని అనిపించింది. మీరు ఆ పాట చూసి ఉంటే, ఈ పాటికే నేను ఏమి చెప్పదలుచు కున్నానో అర్థం అయ్యే ఉంటుంది. ఆ పాట లో మనం ఎలా ఉండాలో చెప్పటానికి కృషి చేసాడు పాట వ్యాస కర్త. అలా అని మొత్తంకాదు, basic గా leaders గా ఉండండి, followers లాగా కాదు, మరియు చేతనయినంత వరుకు మన చేతల వల్ల జనాలు మనలని ఆదర్శం గా తీసుకునేటట్టు నడుచుకోవాలి అని చెప్పారు. ఈ మధ్య almost అన్ని పెద్ద హీరోఎస్ సినిమాల్లో ఏదో ఒక సందేశాత్మక గీతం ఉంటోంది. ఠాగూర్ సినిమాలో కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అన్న పాట కూడా ఆ కోవకి చెందిందే.. కాని అలాంటి పాటలు జనాల మధ్యలోకి అంతగా రావటం లేదు.. అలా అని అన్ని పాటలు జనాల్లోకి రావటం లేదు అని కాదు. నా ఆటోగ్రాఫ్ అనే సినిమాలో
మౌనంగానే ఎదగమనీ అన్న పాటకి ఎంత ప్రాచుర్యం వచ్చిందో అందిరికి తెలిసిందే కాదా!! ప్రతి పాట అలా ప్రాచుర్యం పొందక పోటానికి కారణం ఏదయినా,  ప్రాచుర్యం పొందాలి అని నా ఉద్దేశం.

ప్రతి సినిమాలో ఏదో ఒక కారణంతో ఒక ఐటెంసాంగ్ ఉంటోంది. వాటికి చాలా ప్రాచుర్యం వస్తోంది. ఆ పాట సంగీత దర్శకుడే ఇలాంటి సందేశాత్మక గీతాలకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దాని అర్థం ఆ సంగీత దర్శకుడికి మంచి పాట రాయగల సత్తా లేదు అని కాదు. చెయ్యగలరు మరియు, రోజు రోజుకు వారు మంచి సంగీతం కూడా అందిస్తున్నారు. దానికి చాలా చాలా  THANKS. నా ఉద్దేశంఅల్లా ఐటెంసాంగ్ కి వచ్చినంత ప్రాచుర్యం సందేశాత్మక గీతాలకి వస్తే, సమాజానికి మంచి చేసిన వారు అవుతారు అని మాత్రామే. ఒక పాట ప్రాచుర్యం పొందాలి అంటే పాట సంగీతం, సాహిత్యం మరియు ఆ పాట చిత్రీకరణాలు ఒక కారణం. అందుకని, దర్శకులు చేసే పనిని ఆనందిస్తూ, సమాజానికి మంచి కోరుతూ చేస్తే, మంచి అనగా, మంచి ప్రాచుర్యం పొందేతంతటి పాటలు వస్తాయి అని నా ఉద్దేశం. ఏదో నా పాటకి సరిపడ పారితోషకం వచ్చింది కదా చాలు అని అనుకొని, పాట ని తూతూమాత్రం లాగా కాకుండా శ్రద్ధతో చేస్తే మంచి ప్రాచుర్యం వస్తుంది అని నా ఉద్దేశం.

ఏ పాటకి అయిన ప్రాచుర్యం రావాలి అంటే అందులో దర్శకులకి ఎంత భాద్యత ఉందొ, అంతే భాద్యత మనకి కూడా ఉంటుంది. మంచి పాటని ఆదరించాలి, దాని విలువ పంచాలి, దాని విలువ పెంచాలి, వీలయినంత వరుకు ఆ పాట గురించి మాట్లాడుతూ, జనాల్లోకి దాని తీసుకు వెళ్ళాలి. ఎంత response వస్తే అంత సంగీత దర్శకులకి అది అంత inspiration, అంత కన్నా మంచి పాట శ్రుష్టిచడంలో..అందుకనే వాళ్ళకి ఉనంత భాద్యత, may be more than their’s మనకి ఉంటుంది. మన వంతు కృషి మనం చేద్దాం. ఎవరు ప్రయత్నం వారు చేద్దాం ఇంకా మంచి, better సమాజాన్ని తాయారు చేయడానికి. ఒక మంచి సమాజం లో ఉండటం, మరియు దానికి పాడిచేయకుండా ఉండటం మన కర్తవ్యమ్, భాద్యత. ఇలా చెప్తే చాల మందికి నచ్చదు తెలుసు, కాని ఇది నిజం.


Friday, December 24, 2010

శుభాశ్శిస్సులు


హ్యాపీ బర్త్డే అమ్ము!! .. పుట్టిన రోజు శుభాకాంక్షలు రా సాహితి!!! హాయ్ బుజ్జి,ఇవాళ నీ బర్త్డే రా కన్నా!!
ఇలా ఎన్ని రకాలుగా మనం పిల్లలకి ఆశ్శిస్సులు ఇస్తామో కదా.. ఇంట్లో వాళ్ళు మనస్పూర్తిగా పిల్లలని దీవిన్చినట్టు ఇంక ఎవరు దీవిస్తారు అని నా ప్రశ్న?? . అలా ఇంట్లో వాళ్ళు కాక మనస్పూర్తిగా దీవించే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారేమో అని నా అభిప్రాయం

అసలు అమ్మా, నాన్న దీవించినా పిల్లలకి ఏమి తెలుస్తుంది.?? పిల్లలు అంటే ఇక్కడ నేను సంభోదించేది ఏడాది, రెండు ఏళ్ల లోపు పిల్లల గురించి.. కనీసం రెండు ఏళ్ల పిల్లలు కాకా పోయిన I am talking about 1 year young kids.. వాళ్ళకి మనం ఏమి మాట్లాడుతున్నామో , ఏమి అంటున్నామో స్పష్టం గా అర్థం కాదు. ఏదో తిట్ట కుండా అంటున్నాము అని తప్ప..  అలాగే ఆలోచిస్తే, బయటవాళ్ళు మనని wish  చేసినా , for that matter on any occasion,  వాళ్ళు మనకి మనస్పూర్తిగా ఆశ్శిస్సులు అందిస్తున్నారా అన్నది అర్థం చేస్కోగలమా??  నాకు తెలిసి , దానికి సమాధానం , తెలియదు.. and తెలుస్కోలేము. ఏదో అందరం ఒకటే society లో ఉన్నాం కాదా, పిలవకపోతే, ఏమైనా అనుకుంటారేమో అని కొందరిని,  ఒక్కళ్ళ ని పిలిచి వేరే వాళ్ళని పిలవలేదు అని అనుకుంటారేమో అని ఇంకా కొంత మందిని పిలిచి, అలా మన శుభకార్యాలకు చాలా మందిని పిలుస్తూ ఉంటాము. అలా పిలవక పొతే శుభకార్యం చేసుకునే వాళ్లకి మర్యాద తెలియదు అని భావిస్తారు కూడా.. భావించడమే కదు, అలా అని అందరితో అంటూ, వేరే వాళ్ళ అభిప్రాయం కూడా మారుస్తూ ఉంటారు (అలా ఒకరి మాటమీద అభిప్రాయం మార్చుకునే వాళ్ళు మన చుట్టుపక్కల చాల మందే ఉన్నారు, ఉంటారు. నేను గమనించిన అంతవరుకు నాకు సమాజం మీద ఉన్న అభిప్రాయం అది)

పిల్లల విషయాలకి వస్తే, ఆ మాటకి వస్తే, ఏ శుభకార్యానికి అయినా మనకి బాగా తెలిసి, మనస్పూర్తిగా పిల్లల/మన  క్షేమం కోరే వాళ్ళు అని ఖచ్చితంగా తెలుస్తేనే పిలవాలి అని నా ఉద్దేశం.
మనం పిలిచే అతిధులని రెండు విభాగాలగా ఆలోచిస్తే, ఏమి అనుకోకుండా పిలిచారా , వచ్చామా, wishes చెప్పామా, తిన్నమ్మా,వెళ్లామా అని అనుకునే వాళ్ళతో ఏ సమస్య లేదు.. వాళ్ళ గోల ఏదో వాళ్లది.. వాళ్ళ వాల్ల మనకి ఏమి నష్టం కూడా లేదు.. సమస్య అల్లా ఆ రెండో రకం జనం వల్లే.. ఆలాంటి జనం, మన సమాజం లోనే కాదు, మన చుట్టాలు, బంధువుల్లో కూడా ఉంటారు (నాకు చుట్టాలకి, బంధువులకి తేడ తెలియదు.. తెలుస్కుంట తొందర్లో), వచ్చినందుకు అన్ని ఆరాలు తీస్తారు, మనం మొహమాటం కొద్ది కొన్ని విషయాలు చెప్పడం, దాని మీద వాళ్ళకి ఇంకా కొన్ని ప్రశ్నలు రావడం, అడగ లేక వాళ్ళకి తోచింది వాళ్ళు అనుకోవటం, కొంత వచ్చిన శుభకార్యం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.. అంతటితో ఆగుతే బాగానే ఉంటుంది , అప్పుడు వాళ్ళ వల్ల కూడా సమస్య లేదు అని అనచ్చు. కాని వాళ్ళు అక్కడితో ఆగక, మనసులో అసూయా పెంచుకుంటారు. అసూయ కి కారణం - వాళ్ళ దెగ్గర లేదు అని కాక, మన దెగ్గర ఉంది అని.. లేదా వాళ్ళ దెగ్గర లేనిది మన దెగ్గర ఏదైనా ఉంటె అది ఉందని - .. అసూయ మోతాదు పెరిగి ద్వేషం గా మారుతుంది.. అసూయా, ద్వేషం మధ్య పరిస్తితిలో ఉన్నప్పుడు వాళ్ళకి, మనకి తెలిసిన common స్నేహాతులకి చెప్పడం, వాళ్ళల్లో ఉన్న రెండో రకం జనం వల్ల అలా అలా అందరికి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు చెప్పు కుంటే సమస్య ఏంటి అని అనుకుంటున్నారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా.
సైన్స్ గురించి చాలా తెలియక పోయినా, అందరికి ఏంతో కొంత తెలుసు కదా.. ఈ ప్రపంచం మొత్తం లో రెండు రకాల  శక్తులు ఉంటాయి/ఉన్నాయి అని almost అందరం నమ్ముతాం కదా.. అదే నండి మంచి, చెడు (లేదా బలం, బలహీనత) గురించి మాట్లాడుతున్నాను. Not sure if I conveyed the right meaning or not, I am trying to say about positive and negative energies that exist in this world. మన పురాణాల్లో కూడా దీని ప్రస్తావన ఉంది కదా. అందుకే మంచికి రూపం దేవుళ్ళు అని, చెడుకి రూపం రాక్షసులు అని సంభోదిస్తాము. ఎప్పుడు అయితే చెడు ఎక్కువ అవుతుందో, అప్పుడు మనకి కష్టం వచ్చినట్టు భావిస్తాము. అలా జనుల అసూయా, ద్వేషం (negative thoughts, which inturn become negative energy) వల్ల వాటినుంచి తప్పించుకోటానికి మనకి తెలియకుండానే మనం కూడా ఆ చెడు తో సావాసం చేస్తాం(it may be out of frustration for not getting the results even after we followed the right path all the way till date) .. అలా చెయ్యడం వల్ల మనకి మనం చెడు  చేస్కుంటూ వేరేవాళ్ళకి కూడా చెడు చేస్తాము/చేస్తున్నాం.

దీని అంతటికి కారణం, మనం చేసేది సబబా (correcta) లేదా అని ఆలోచించకుండా మన చుట్టూ ఉన్న సమాజం కోసం ఆలోచించటం వల్ల, అని నా అభిప్రాయం.. అలా అని ఎవరి గురించి ఆలోచించకుండా  నా  సంగతి ఏదో నేను చూస్కుంటా చాలు అని ఉండాలి అని నా ఉద్దేశం కాదు, ఏది మంచో , ఏది చేడో ఆలోచించే శక్తి తెచ్చుకొని, ఆ శక్తి ని వాడుతూ దాని ప్రకారం నడుచుకుంటే మంచిది అని నా అభిప్రాయం. అలా చెయ్యడం వల్ల  మనకి మంచి జరుగుతుంది అండ్ ఎదుటి వారికి  కూడా  ఎంతో కొంత మంచి జరుగుతుంది.

శుభకార్యాలకు అందరిని పిలిచి భోజనాలు పెడితే మంచిది అంటారు కదా అని ఏమైనా ప్రశ్న మిగిలి ఉంటే, నాకు తోచి అండ్ తెలిసి, నిజంగా మీరు మంచే చేయ్యదలుచు కుంటే, మన సమాజం లో మరియు ఈ ప్రపంచం లో తిండి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు.. వాళ్ళకి సహాయం చేద్దాం , వాళ్ళని పిలిచి మన శుభకార్యాలకు భోజనం పెడదాం, వాళ్ళ ఆకలి తీరుద్దాం. అలా చెయ్యడం వల్ల పుణ్యం పురుషార్ధం రెండు ఉంటాయి. వాళ్ళ ఆకలి తీరినందుకు వాళ్ళు మనకి మంచి జరగాలి అని శుభం ఆశిస్తారు , లేక పొతే కనీసం సాధారణం గా ఉంటారు అంతే కదా , మన మీద ఆసూయ, ద్వేషాలు  పెంచుకోరు కదా..  

ఒక్క సారి ఆలోచించండి, మన కోసం మనం బతుకుతూ , అవసరం అయిన వాళ్ళకి సహాయం చేద్దామా or సమాజం కోసం మనం బతుకుదామా?? ఎవరికీ ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి వాళ్ళు మంచి, చెడు అలోచించి చేస్తే అదే చాలు.

Tuesday, December 21, 2010

ప్రేరణ

Who ever reads these, hello. Not sure if I would publish this are not, but want to write something.. so this would me first trial..

And since I downloaded telugu editor only today, I would try writing in telugu, but might keep shifting the language/words I would be writing in here.. 

ఈ బ్లాగ్ స్టార్ట్ చేసింది ఇవాళే.. id మాత్రం ఎప్పుడో create చేస్కున్నాను.. కానీ ధైర్యం సరిపోలేదు, బ్లాగ్ పోస్ట్ చెయ్యటానికి.. ఎవరు చదువుతారు లే అని మొదలు పెట్టలేదు .. ఇవాళ  ఎందుకో, ఎవరూ  చదవక పోయిన పర్వాలేదు, నేనే చదువుకోవచ్చు అని మొదలు పెట్టాను.. అందుకే నా  బ్లాగ్ పేరు కూడా "నా మొదటి ప్రయత్నం" అని  పెట్టాను.. ఎప్పటికైనా ఎవరైనా చదివితే, వాళ్ళందరికి నా హాయ్..

ఎవరైనా ఏ పని అయిన చెయ్యటానికి సరిఅయిన ప్రేరణ ఉండాలి.. అది మంచి పని అయిన లేక ఇంకా ఏ పని అయిన సరే . నాకు  ప్రేరణ ముగ్గురు.. 

మొదట , ఒక  స్నేహితుడు, రెండో కారణం http://bigb.bigadda.com/
 మరియు మూడో కారణం, తమ్ముడి ద్వారా తెలిసిన http://girishmahadevan.blogspot.com/

స్నేహితుడికి ఉన్న అలవాట్లలో బ్లాగ్గింగ్ కూడా ఒక అలవాటు.. తను పరిచయం అయ్యాక తన బ్లాగ్స్ చదవటం నాకు అలవాటు గా మారింది. అది కాకుండా తన బ్లాగ్ తెలుగు లో ఉంటుంది.. అలా తెలుగు లో ఎలా రాస్తారా అని చాలా ఆత్రుతగా  ఉండేది. అడిగి తెలుసుకున్నా. కానీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అలా  ప్రయత్నించక షుమారుగా మూడు నుంచి నలుగు ఏళ్లు అయిపొయింది.

రెండో కారణం, BIGB (అదే నండి అమితాబ్ బచ్చన్, హిందీ ఫిలిం actor) గురించి చెప్పటానికి చాల ఉంటుంది కానీ, నాకే మొత్తం తెలియదు.. నాకు తెలిసినంత వరుకు నాకు అయిన సినిమాలు అన్నా, ఆయిన అన్నా అభిమానం ఉంది. ఆ అభిమనం తోనే అయిన బ్లాగ్ కూడా రెగ్యులర్ గా చదువుతున్నాను. చదవటం మొదలు పెట్టి సంవత్సరం అయ్యిందేమో. ఆయిన కూడా మధ్యలో హిందీ లో రాస్తూ ఉంటారు. and ఆయిన చాలా రెగ్యులర్ గా రాస్తారు. సాధారణ  జీవితం గడిపే నాకు చదవటం కుదరదేమో కానీ, ఆయిన మాత్రం, రోజు మొత్తం లో ఎంత లేట్ అయినా, atleast రెండు lines అయినా  రాస్తారు, even after being such a busy person. That's one more reason why I admire him.

మూడో కారణం అయిన వ్యక్తి, గిరీష్.. ఆయిన బ్లాగ్ కూడా బాగుంటుంది. తను ఏమి చెప్పదలచుకున్నాడో అది సూటి గా  చెప్తాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని అస్సలు ఆలోచించడు, అని అనిపిస్తుంది బ్లాగ్ చదివితే. మరి ఆయిన ఉద్దేశం అదే నేమో తెలియదు. Latest  తన బ్లాగ్ http://girishmahadevan.blogspot.com/2010/12/i-read-so-i-wrote.html చదివాకా, అవును కదా అని అనిపించింది. 

ఎంత మంది కారణం అయినా, వీళ్ళఅందరి కన్నా ముందు thanks చెప్పుకోవాల్సింది మా నాన్నా గారికి. ఎందుకంటే ఆయినే నాకు ఇంగ్లీష లో గుడింతాలు నేర్పించింది చిన్నప్పుడు, అది రాక పొతే, కొంచం కష్టం అయ్యేది,ఈ కలం లో ఇంగ్లీష లో తెలుగు  రాయడం అండ్ ఇలా డైరెక్ట్ తెలుగు లో రాయడం కూడా.. రాదు అని అనను కానీ, కష్టం అయ్యేది అని అంటున్న అంతే..

ఇంకో ఫ్రెండ్ తెలుగు లో కవితలు రాస్తాడు... తను రాసినప్పుడు అనుకునే దాన్ని, కానీ ఆ టాపిక్ నుంచి వేరే టాపిక్ ఆలోచిన్చేటప్పటికి ఆ విషయమే మర్చిపోయే దాన్ని..

ఏమి రాయాలా!! అని ఆలోచిస్తూనే చాలా రాసాను అనుకుంటా కదా. Great job (Self Patting :) )..

రోజు ఏదో ఒకటి రాయాలని నా ఈ చిన్న ప్రయత్నం. చూద్దాం ఎంత వరుకు రాయగలనో..